ప్రఖ్యాత పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్‌కు చెందిన కెనడాలోని నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కాల్పుల తరవాత ఓ గ్యాంగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 2022లో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో హత్యకు గురైన సిద్దూ మూసేవాలా, గ్యాంగ్ స్టర్ జగ్గు భగవాన్ పురియా పేర్లను ప్రస్తావించారు.
థిల్లాన్ బూట్ కల్, ఓల్డ్ స్కూల్, మఝా బ్లాక్ వంటి సూపర్ హిట్ పాటలతో గుర్తింపుపొందారు. గత ఏడాది సెప్టెంబరులో కెనడాలోని వాంకోవర్ విక్టోరియా ద్వీపంలో పంజాబీ గాయకుడు థిల్లాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని రోహిత్ గొదారా కారణంగా ప్రచారంలోకి వచ్చింది.
కెనడాలోని ప్రఖ్యాత గాయకుడు గిప్పీ గ్రెవాల్ ఇంటి ఆవరణలో 2023 సెప్టెంబరులో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ ఈ కాల్పులకు దిగినట్లు ప్రకటించారు.