దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి5న జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
దిల్లీలోని 70 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 10తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
ఫిబ్రవరి ఐదున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న లెక్కింపు జరగనుంది.
దిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58 జనరల్ స్థానాలు కాగా మిగతా 12 ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లు.
PWD ఓటర్ల వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 79,430 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్లు ఉన్నారు. 100 ఏళ్ళు దాటిన ఓటర్లు 830 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.