తెలంగాణలో బీటెక్, బీఫార్మసీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి TG EAPCET: 25 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు ఉంటాయి. ఎప్ సెట్ పరీక్ష కేంద్రాలను విజయవాడ, కర్నూలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
జేఎన్‌టీయూ హైదరాబాద్ లో ఫిబ్రవరి 3న ఎప్‌సెట్‌తోపాటు పీజీఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశాలు నిర్వహించారు. జేఎన్‌టీయూహెచ్ ఇన్‌ఛార్జ్ వీసీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి సమాలోచనలు చేసి షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
ఇప్పటివరకు అన్‌రిజర్వుడ్ కోటా 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు కావడంతో ఆ కోటా విషయమై తుది నిర్ణయం తీసుకోవాలి. దివ్యాంగులకు ఉన్నత విద్యా కోర్సుల్లో 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి, మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఐసెట్ ఎప్పుడంటే…?
ఐసెట్ 2025 పరీక్ష నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. మే 3న వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.