దక్షిణార్ధ గోళములో ఇదే అతి పెద్దదని ‘బాప్స్’ ప్రకటన
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బాప్స్ ) తెలిపింది.
దక్షిణార్ధగోళములో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రారంభ ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు హాజరయ్యారు. దక్షిణాఫ్రికా జనాభాలో హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే. భారతీయ సమాజంలో అత్యధికులు అక్కడ హిందూ మతాన్నే అనుసరిస్తారు.
ఆధ్యాత్మిక గురువు, బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బాప్స్)కు చెందిన మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది.