బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో అఫ్తాబ్ ఖాన్ అనేవాడి నాయకత్వంలో కొంతమంది ముస్లిముల ముఠా అమ్మాయిలను ఆకట్టుకుని వ్యభిచారంలోకి దింపుతోంది. జిల్లాలోని కథియార్ మోరే ప్రాంతంలో పోలీసులు గత గురువారం, జనవరి 30న దాడులు చేసారు, వ్యభిచారంలోకి నెట్టబడిన 11మంది మైనర్ బాలికలను రక్షించారు.
ఆ కేసుకు సంబంధించి పోలీసులు 32మందిని అరెస్ట్ చేసారు. వారి రింగ్‌లీడర్ అఫ్తాబ్ ఖాన్, హిందూ పేరుతో చెలామణీ అవుతున్నాడు. తన కారుమీద ‘జై బజరంగ్ బలీ’ అనే స్టిక్కర్ అంటించాడు. అంకిత్ తివారీ అనే పేరుతో హిందూ అమ్మాయిలను ఆకట్టుకుని, వాళ్ళని ప్రేమలోకి దింపేవాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో తీసుకుని వెళ్ళిపోయేవాడు. తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేసేవాడు.
అఫ్తాబ్ ఖాన్ అనుచరుల్లో ముఖ్యమైన వాళ్ళు మొహమ్మద్ షాకిబ్, మౌసమ్ ఖాన్, గుడ్డూ ఖాన్, జుబేదా. వాళ్ళు కూడా హిందూ పేర్లు పెట్టుకుని అమ్మాయిలను ఆకర్షించేవారు.
షాకిబ్ అలియాస్ రాజీవ్ షా హిందూ అమ్మాయిలను వేర్వేరు ప్రదేశాల నుంచి తీసుకొచ్చేవాడు. గుడ్డూఖాన్ అలియాస్ రిషభ్ షా ఫోన్ కాల్స్ ద్వారా అమ్మాయిలతో పరిచయాలు చేసుకుని ఆకట్టుకునేవాడు. జుబేదా అలియాస్ కత్రినా వ్యభిచార గృహం నిర్వహించడంలో సాయపడేది.
అఫ్తాబ్ ఖాన్ నడిపే ఈ ముస్లిం ముఠా, కస్టమర్ల దగ్గర నుంచీ ఒక రాత్రికి రూ.10వేలు చార్జి చేసేది. ఇంక ఇతర రాష్ట్రాలకు అమ్మాయిలను అమ్మేసేటప్పుడు ఒక్కో అమ్మాయికీ కనీసం 5లక్షలు వెల కట్టేవారు.
ముఠాలోని అందరినీ పోలీసులు పట్టుకున్నారు, కానీ అఫ్తాబ్ ఖాన్ దొరకలేదు. అతనిమీద పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. అఫ్తాబ్ కోసం వెతుకుతున్నారు. మైనర్ బాలికలను జువెనైల్ హోంకు తరలించారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ