మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్ జిల్లాలో అన్నాదమ్ముల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. చనిపోయిన తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా పంచాలని, తన వాటా శవానికి అంత్యక్రియలు చేసుకుంటాననీ ఒక సోదరుడు డిమాండ్ చేసాడు. చివరికి వ్యవహారం పోలీసు జోక్యం వరకూ వెళ్ళింది.
టీకంగఢ్ జిల్లా లిధోరాతాల్ గ్రామానికి చెందిన 84ఏళ్ళ ధ్యానీ సింగ్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఆదివారం నాడు చనిపోయాడు. మరణించే సమయానికి తండ్రి తన చిన్నకొడుకు దేశరాజ్ ఇంట్లో ఉన్నాడు. తండ్రి మరణ వార్త విని, గ్రామం బైట నివసిస్తున్న పెద్ద కొడుకు కిషన్ తమ్ముడి ఇంటికి వచ్చాడు.
తండ్రి అంత్యక్రియలు ఎవరు చేయాలనే విషయం మీద అన్నాదమ్ముల ఇద్దరి మధ్యా ఘర్షణ చెలరేగింది. గొడవ ఎంత పెద్దదయిందంటే గ్రామస్తులు జోక్యం చేసుకున్నా తేలలేదు. దాంతో గ్రామస్తులు జాతర పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అన్నాదమ్ములకు సర్దిచెప్పడంతో సమస్య పరిష్కారమైంది.
చిన్నకొడుకు దేశరాజ్ చెబుతున్న ప్రకారం, తండ్రి తన అంత్యక్రియలు చిన్నకొడుకునే చేయమని కోరాడట. తండ్రి మరణవార్త తెలిసిన పెద్దకొడుకు కిషన్, తాగేసి వచ్చాడట. అంత్యక్రియలు తానే చేస్తానంటూ పెద్దకొడుకు పట్టు పట్టాడట. తండ్రి చివరి కోరిక గురించి చెబితే ఒప్పుకోలేదట. శవాన్ని రెండు ముక్కలు చేయాల్సిందే, ఇద్దరూ అంత్యక్రియలు చేయాల్సిందే అంటూ హడావుడి చేసాడట.
చివరికి, పోలీసులు కిషన్‌కు నచ్చజెప్పారు. తండ్రి కోరుకున్నట్లే చిన్నకొడుకు కిషనే అంత్యక్రియలు పూర్తి చేసాడు. దాంతో కథ సుఖాంతమైంది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ