చిత్ర నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. పలు చిత్రాలకు నిర్మాతగా, మరికొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కేపీ చౌదరి వ్యవహరించారు. చిత్ర నిర్మాణంలో నష్టాలు రావడంతో ఆయన డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన కేపీ చౌదరి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కబాలి చిత్ర నిర్మాతగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన కేపీ చౌదరి #kpchowdary తీవ్రంగా నష్టపోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని పాల్వంచకు చెందిన కేపీ చౌదరి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సహచరులు తెలిపారు. గోవాలోని ఓ రిసార్టులో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు అందించిన సమాచారంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ