ప్రతీ యేటా వసంత పంచమి సందర్భంగా బాలవీరుడు హకీకత్ రాయ్ కథను తలచుకుని తీరాలి. తురుష్క ముష్కరులు చేపట్టిన మత మార్పిడి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన వారి వివరాలు చరిత్రలో నమోదవడం హకీకత్ రాయ్‌తోనే మొట్టమొదటిసారి మొదలయ్యాయి. ఇస్లాంలోకి మతం మారాలన్న ఒత్తిడులను తట్టుకుంటూ అపరిమిత ధైర్య సాహసాలతో ముస్లిములను ఎదుర్కొన్న హకీకత్ రాయ్, తన 14వ ఏట అంటే 1742లో ప్రాణాలను త్యాగం చేసాడు. లాహోర్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా నమోదైన మొట్టమొదటి కేసు అదే.
1729. సియాల్‌కోట్, అవిభక్త పంజాబ్. హకీకత్ రాయ్ ఓ హిందూ సంప్రదాయిక కుటుంబలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు బాఘ్‌మల్, కౌరాదేవి. బాల్యం నుంచీ అతనికి నైతిక విలువలు బోధిస్తూ పెంచారు. చాలా చిన్నతనం నుంచే హకీకత్ బాగా చదువుకునే వాడు. నాలుగేళ్ళ వయసుకే అతను భగవద్గీత, పురాణాలు, ఇతర ప్రాచీన జానపద కథల వంటివన్నీ చదివేయడం విశేషం .
అప్పట్లో భారతదేశానికి అధికారిక వ్యవహార భాషగా పర్షియన్ ఉండేది. దాంతో చాలావరకూ హిందూ కుటుంబాలు తమ పిల్లలను విద్య కోసం మదరసాలకు పంపించేవారు. అదే పద్ధతిలో హకీకత్ రాయ్‌ని కూడా మదరసలో చేర్చారు. అక్కడ అతను బాగా చదువుకున్నాడు.
ఒకానొక దురదృష్టకరమైన రోజున హకీకత్‌కు, అతని సహచర ముస్లిం విద్యార్ధులకూ వాదన పెరిగి ముదిరింది. యువ ముస్లిం విద్యార్ధులు హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయసాగారు. ముఖ్యమంగా దుర్గామాత గురించి బాగా విమర్శించారు. దాంతో వారికి అర్ధమయ్యేలా చెప్పడానికి హకీకత్ ప్రయత్నించాడు. ‘‘మీ మతంలోని పెద్దవారి గురించి నేను చెడుగా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీరు సహిస్తారా?’’ అని ప్రశ్నించాడు. దాంతో హకీకత్ తరగతిలోని ముస్లిం విద్యార్ధుల ఆగ్రహం ఆకాశాన్నంటింది. మహమ్మద్ ప్రవక్త, బీబీ ఫాతిమాల గురించి దైవదూషణ చేసాడంటూ అతనిపై నేరం ఆరోపించారు.
ఆ వ్యవహారం వేగంగా రచ్చకెక్కింది. హకీకత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంను అగౌరవ పరచడం ద్వారా హకీకత్ క్షమించరాని నేరం చేసాడని నగర కాజీ తీర్మానించాడు. హకీకత్ తన పాపాలను తొలగించుకోవాలంటే, తాను చేరుకోవాలంటే హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ముస్లిముగా మారిపోవలసిదే. లేదంటే మరణశిక్ష ఎదుర్కోవలసిందే అని ఆదేశించాడు.
హకీకత్ తండ్రి తన కుమారుడికి న్యాయం చేయాలంటూ లాహోర్ గవర్నర్ జకారియా ఖాన్‌కు విజ్ఞప్తి చేసాడు. కానీ అప్పటికే ఒక మూక అక్కడ చేరుకుంది. హకీకత్ దైవదూషణ చేసాడనీ, అతన్ని చంపేయాలనీ ఆ మూక అల్లరి చేస్తోంది. ఆ బాలుడికి మతం మారిపోతే ప్రాణాలు దక్కించుకోవచ్చు అంటూ అవకాశం ఇచ్చారు. కానీ, సంకెళ్ళతో బంధించి ఉన్న ఆ 14ఏళ్ళ చిన్నారి హకీకత్, న్యాయమూర్తి ముందు ధైర్యంగా నిలబడ్డాడు. కాజీ అతన్ని అడిగాడు, ‘‘నువ్వు దేన్ని ఎంచుకున్నావు, చావునా లేక ఇస్లాంనా?’’
హకీకత్ ఏమాత్రం భయం లేకుండా ఎదురు ప్రశ్నించాడు, ‘‘నాకు ఒక విషయం చెప్పండి. ముస్లిములకు మరణం ఉండదా? నేను ఇస్లాం తీసుకుంటే నేను ఎప్పటికీ బతికే ఉంటానా?’’
మరణం ఎవరికైనా సరే తప్పించజాలనిదే అని కాజీ అంగీకరించాడు. అప్పడు హకీకత్ ‘‘అలాంటప్పుడు నేను నా విశ్వాసాన్ని ఎందుకు వదులుకోవాలి? చావు తప్పదు అంటే, నేను హిందువుగానే చనిపోవాలని ఎంచుకుంటాను’’ అని జవాబిచ్చాడు.
ముస్లింగా మతం మారకూడదన్న నిర్ణయం హకీకత్ భవిష్యత్తును మార్చేసింది. హకీకత్ రాయ్‌ను ప్రజలందరూ రాళ్ళతో కొట్టి చంపాలి అనే తీర్పు ఇచ్చారు. అతని తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. హకీకత్ తల్లి కళ్ళ నుంచి నీళ్ళు జలజలా రాలిపోతున్నాయి. అయినా హకీకత్ తన నిర్ణయం మార్చుకోలేదు.
1742 వసంత పంచమి రోజు ఆ 14ఏళ్ళ చిన్న పిల్లవాడిని లాహోర్ నగర వీధుల్లో భారీ జనసమూహం ముందు ఉంచారు. నేలలో గొయ్యి తీసి అతన్ని కాళ్ళ వరకూ కప్పెట్టేసారు. అతన్ని రాళ్ళతో కొడుతూ ఉండాలని ప్రజలను ఆదేశించారు. దానివల్ల శిక్ష సుదీర్ఘ సమయం అమలవుతుంది. అంతసేపూ ఆ పిల్లవాడు నొప్పిని అనుభవిస్తాడు. ఆ నొప్పితో ఎప్పటికో ప్రాణాలు కోల్పోతాడు. అంత బాధలోనూ హకీకత్ కించిత్ అయినా కదల్లేదు. అతని కళ్ళు తాను నమ్మిన ధర్మాన్నే ప్రతిఫలిస్తూ ఉండిపోయాయి. జనాలు తమ చేతులు నొప్పి పుట్టేవరకూ రాళ్ళు విసిరారు. ఎట్టకేలకు ఆ వసంత పంచమి రోజు హకీకత్ రాయ్ తాను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించేసాడు.
హకీకత్ రాయ్ అమరుడయ్యాక అతని గౌరవార్థం లాహోర్‌లో ఒక స్మారకం నిర్మించారు. అక్కడ ప్రతీయేటా వసంత పంచమి నాడు ప్రజలు సమావేశమై, హకీకత్ త్యాగానికి నివాళులు అర్పించేవారు. హకీకత్ పుట్టిన ప్రదేశం సియాల్‌కోట్‌లో ఇంకొక స్మారకం నిర్మించారు. కాలక్రమంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ స్మారకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్నిచోట్ల అయితే హకీకత్ స్మారకాలను కూల్చివేసారు కూడా. అయినా అతని స్ఫూర్తి ఇంకా నిలిచే ఉంది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ