ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. నేటితో ప్రచారపర్వం ముగుస్తుంది. ఆ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి నిఘావర్గాలు భారీమొత్తంలో నగదు, మాదకద్రవ్యాలు, మద్యం, బంగారం, ఉచిత కానుకలు జప్తు చేసాయి. ఇప్పటివరకూ జప్తు చేసిన నగదు, వస్తువుల మొత్తం విలువ 218 కోట్లకు పైమాటే.
ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం రూ. 38,64,20,564 నగదు జప్తు చేసారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జప్తు చేసిన నగదు కంటె ఇది ఏకంగా 202శాతం ఎక్కువ. ఇంకా రూ. 88,40,08,723 విలువైన మాదక ద్రవ్యాలు, రూ. 80,78,50,903 విలువైన బంగారం, రూ.4,93,75,770 విలువైన మద్యం, రూ. 5,52,07,159 విలువైన ఉచిత కానుకలను జప్తు చేసారు. మొత్తంగా 2703 ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసారు. 2020 ఎన్నికల వేళ నమోదైన కేసులు 2067 కంటె ఈ సంఖ్య ఎక్కువ.
ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, ఎలాంటి ప్రలోభాలూ లేకుండా జరిపేందుకు కృషి చేస్తున్నామని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5 బుధవారం నాడు జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8, శనివారం నాడు జరుగుతుంది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ