వసంత పంచమి పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే భక్తలు అమృత స్నానాలు చేసేందుకు తరలివచ్చారు. పుణ్య దినం కావడంతో ఇవాళ దాదాపు 6కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. మౌని అమావాస్యనాడు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి, చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో యోగీ సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఇవాళ ఉదయం 3 గంటలకు సీఎం యోగి ప్రయాగ్‌రాజ్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. వీఐపీ పాసులు మొత్తం రద్దు చేశారు. ఇప్పటికే 35 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మొత్తం 45 కోట్ల మంది వస్తారని అంచనా. ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
గత వారం మౌని అమావాస్య సందర్శంగా 8 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ