ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రజా రవాణా సంస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీ కూడా భాగమైంది. వాట్సాప్ ద్వారా ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయి సిబ్బందికి వాట్సాప్ సేవలపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.
బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు 9552300009 నంబర్‌కు ముందుగా ‘హాయ్’ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత సేవల జాబితా కనిపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వాట్సాప్‌లో వచ్చిన టికెట్‌ను చూపి సంబంధిత సర్వీసు బస్సులో ప్రయాణించవచ్చు.