వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు మరోసారి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి పోటెత్తారు. ఈ ఉదయం 8 గంటల వరకు 41.90 లక్షల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించారు. హరిద్వార్‌లోని హరి కి పౌరీ వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు.
కుంభమేళా ప్రారంభమైన జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు 33.61 కోట్ల మందికిపైగా పవిత్ర స్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకూ జరిగే కొనసాగే ఈ కుంభమేళాకు 50 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది.