ఏపీలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన కేల్యూ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదైంది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చిన సమాచారం అందడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కెఎల్యూ యాజమాన్యం న్యాక్ సభ్యులకు రూ.25 లక్షల నగదు, ల్యాప్ ట్యాప్లు, ఖరీదైన మొబైల్ ఫోన్లు బహుమతిగా ఇచ్చినట్లు అందిన సమాచారం మేరకు ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పది మందిని అదుపులోకి తీసున్నారు.
దేశ వ్యాప్తంగా సీబీఐ అధికారులు న్యాక్ బృందంలోని సభ్యుల నివాసాలపై దాడులు చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేఎల్యూ ఛైర్మన్ కోనేరు లక్షయ్యను అదుపులోకి తీసుకున్నారు.చెన్నై, భూపాల్, ఢిల్లీలోని ప్రొఫెసర్ల నివాసాలపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. పది మంది ప్రొఫెసర్లను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా న్యాక్ సభ్యులు యూనివర్సిటీలను సందర్శించిన అక్కడ లభిస్తోన్న బోధన, సదుపాయాలు, ఫ్యాక్టల్టీ వివరాలను తీసుకుని, ర్యాంకులు కేటాయిస్తూ ఉంటుంది. ఏ++ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఎక్కువ ఫీజులు వసూలు చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. ఈ విధంగా గత కొంతకాలంగా కేఎల్యూ యాజమాన్యం అక్రమ పద్దతుల్లో గుర్తింపు పొందుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి.