ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యానవనం సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సందర్శకులను ఉచితంగా అనుమిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వరకు అమృత్ ఉద్యానవనాన్ని తెరిచి ఉంచుతామని అధికారులు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఉద్యానవనాన్ని ఉచితంగా సందర్శించవచ్చు. శనివారం మాత్రం ఎవరినీ అనుమతించరు.
తులిప్ ఉద్యాన వనంలో వేలాది రకాల పుష్పజాతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యానవనంలో 6 వేల రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లో పెరిగే తులిప్ పూల తోటలను రాష్ట్రపతి భవన్ గార్డెన్లో పెంచుతున్నారు. రెండు నెలల్లో ఏటా 5 లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశముంది.