మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC ) నవీన్ చావ్లా(79) తుదిశ్వాస విడిచారు. మెదడు శస్త్రచికిత్స కోసం దిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన చావ్లా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాజీ సీఈసీ SY ఖురైషి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
నవీన్ చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా, ఆ తర్వాత 2009 ఏప్రిల్ నుంచి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా పనిచేశారు.
విధి నిర్వహణలో నవీన్ చావ్లాను పలు వివాదాలు ఎదుర్కొన్నారు. 2006లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎల్కే అద్వానీ, 204 మంది ఎంపీలు చావ్లాను ఎన్నికల కమిషనర్గా తొలగించాలని కోరుతూ అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను కోరారు.
సుప్రీంకోర్టును కూడా అప్పటి ప్రతిపక్ష బీజేపీ ఆశ్రయించింది. చావ్లాను తొలగించాలని నాటి సీఈసీ గోపాలస్వామి ప్రభుత్వాన్ని కోరారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఈసీ నుంచి సీఈసీగా పదోన్నతి కల్పించింది.