ఛత్తీస్గఢ్ మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతోన్న బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవాళ ఉదయం నుంచి మావోయిస్టులు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బలగాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
2026 చివరినాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ రూపొందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఎన్కౌంటర్లలో 200 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. కేంద్ర కమిటీలోని కీలక మావోయిస్టు నేతలు చనిపోవడంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.