కేంద్రప్రభుత్వం 2025-26 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ సహా పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు.
పోలవరం ప్రాజెక్టుకు – రూ. 5,936 కోట్లు కేటాయించగా, పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ – రూ. 12,157 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు – రూ.730 కోట్లు కేటాయించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని కేటాయింపులు ఇలా…
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ రూ. 186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్ రూ. 375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతం రూ. 162 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ రెండో దశ రూ.242.50 కోట్లు
కేంద్ర బడ్జెట్ 2025ను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని కొనియాడారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికత, బడ్జెట్ లో ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు.