ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఫొటోలు దిగారు.
144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రోజుకు సమారుగా కోటి మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరుగుతోంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఈ కుంభమేళా ముగియనుంది.