Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

గాంధీ హత్య – జవాబుల్లేని ప్రశ్నలు : గాడ్సే పావు మాత్రమేనా?

Phaneendra by Phaneendra
Feb 1, 2025, 11:07 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

1948 జనవరి 30 సాయంత్రం 5.17 గంటలకు న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసారు. హిందూ జాతీయవాది అయిన గాడ్సే తాను ఒక్కడే ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నది భారత ప్రభుత్వపు అధికారిక కథనం. అయితే గాంధీ హత్య గురించి ఎన్నో ప్రశ్నలు నేటికీ జవాబు లేకుండానే ఉన్నాయి. అది కేవలం ఒక వ్యక్తి ఆగ్రహంతో చేసిన హత్యా? లేక ఒక మహాకుట్రలో భాగం మాత్రమేనా? గాంధీ హత్యను భారతదేశపు అధికార నిర్మాణాన్ని తిరగరాసేందుకు రాజకీయ పరికరంగా వాడుకున్నారా?

1948 జనవరి 13 నుంచీ గాంధీ నిరాహార దీక్షలో ఉన్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేయాలన్నది ఆయన డిమాండ్. జనవరి 20న ఆయన మీద ఒకసారి హత్యాప్రయత్నం జరిగింది. గాడ్సే, అతని అనుచరులు ప్రార్థనా స్థలం మీద బాంబు విసిరి గాంధీని చంపడానికి ప్రయత్నించారు. ఆ కుట్ర భాగస్వాముల్లో ఒకరైన మదన్‌లాల్ పహ్వా పోలీసులకు దొరికిపోయాడు. అతను పోలీసు విచారణలో హత్య పథకం మొత్తాన్నీ బైట పెట్టేసాడు. అయినప్పటికీ, దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే గాడ్సే, అతని ప్రధాన అనుచరులు ఆ తర్వాత పది రోజులూ చాలా స్వేచ్ఛగా బైట తిరుగుతూనే ఉన్నారు.

గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందన్న సంగతి పోలీసులకు చాలా స్పష్టంగా తెలుసు. వారికి జనవరి 20 నుంచి 30లోపు గాడ్సేను అరెస్ట్ చేయడానికి 60కి పైగా అవకాశాలు వచ్చాయి, కానీ అతన్ని అదుపులోకి తీసుకోలేదు, కనీసం అతని మీద సరైన నిఘా ఉంచలేదు. అలాంటి నిర్లక్ష్యం ఎలా సాధ్యమైంది? అది చేతకానితనమా లేక గాంధీ హత్య జరగనివ్వాలని ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమా?

జనవరి 30న గాంధీ తన ప్రార్థనా సమావేశానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మను బెన్ కుడివైపు, ఆభా బెన్ ఎడమవైపు ఉన్నారు. గాడ్సే ఖాకీ దుస్తులు ధరించి, గాంధీ నడుస్తున్న దారిలో జోడించిన చేతులతో ఎదురు వచ్చాడు. అతను గాంధీ పాదాలను తాకాలని భావిస్తున్నాడు అనుకున్న మనూ బెన్ అతన్ని వారించింది. ‘‘బాపూ ఇప్పటికే పది నిమిషాలు ఆలస్యమయ్యారు, ఆయనను ఇబ్బది పెడతారెందుకు?’’ అంటూ నిలువరించింది.

అంతలో గాడ్సే ఆమెను బలవంతంగా పక్కకు తోసేసాడు. తన చేతిలోకి బెరెట్టా ఎం1934 అనే 9మిల్లీమీటర్ల ఇటాలియన్ పిస్తోలును బైటకు తీసాడు. గాంధీని పాయింట్‌బ్లాంక్‌లో కాల్చాడు. అతను కాల్చినవి మూడు బులెట్లా లేక నాలుగా అన్నదాని మీద సరైన వివరాలు లేవు. దాన్నిబట్టి అధికారిక పత్రాలను మార్చారా అన్న అనుమానాలూ ఉన్నాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అక్కడ పొగ అలముకుంది, గందరగోళం నెలకొంది. విచిత్రంగా, గాంధీ హత్యతో దిగ్భ్రాంతికి గురైన ఆ జన సందోహం మధ్యలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నిశ్చలంగా, ఏమాత్రం తొట్రుపాటు లేకుండా ఉన్నాడు. అతని పేరు హెర్బర్ట్ రేనర్ జూనియర్. అతనో అమెరికన్ ఆర్మీ అధికారి, భారతదేశంలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నాడు. అతను వేగంగా గాడ్సేని పట్టుకున్నాడు, పోలీసులకు అప్పగించాడు. స్వయంగా గాడ్సేయే కొన్ని క్షణాల పాటు దిగ్భ్రాంతి చెంది ఉన్న ఆ సమయంలో రేనర్ అంత వేగంగా ఎలా స్పందించాడు? అసలు రేనర్ ఆ సమయంలో అక్కడ ఉండి, జరిగిన సంఘటనతో అప్రమత్తమయ్యాడు అంతేనా? లేక జరగబోయే దాడి గురించి అతనికి ముందే తెలుసా?

జవాబులు లేని ప్రశ్నలు:

(1) గాంధీని ఆస్పత్రికి ఎందుకు తీసుకువెళ్ళలేదు?

కాల్పుల ఘటన జరిగిన వెంటనే గాంధీని బిర్లాహౌస్‌లోని ఒక నివాస ప్రాంతంలోకి తీసుకువెళ్ళారు. అక్కడే ఆయన గాయాలతో 5.40 నిమిషాలకు, అంటే కాల్పులు జరిపిన 23 నిమిషాల తర్వాత, తుదిశ్వాస విడిచాడు. గాంధీకి వైద్య చికిత్స అందిఉంటే ఆయన బతికేవాడా?

(2) గాంధీ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయలేదు?

కారణమేంటో తెలియదు కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యక్ష ఆదేశాల ప్రకారం గాంధీ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించలేదు. దేన్ని దాచిపెట్టడం కోసం అటాప్సీని వాయిదా వేసారు?

(3) గాడ్సే ఉద్దేశాలేంటో తెలిసాక కూడా అతనిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు?

గాడ్సే, అతని బృందం జనవరి 20న చేసిన దాడి తర్వాత అతన్ని అరెస్ట్ చేసి ఉంటే గాంధీ హత్యను ఆపడం సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే అప్పుడే అతన్ని అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణాలేంటి? ఉద్దేశపూర్వకంగానే గాడ్సేని వదిలేసారా?

(4) గాడ్సేకి ఇటాలియన్ బెరెట్టా తుపాకి ఎలా వచ్చింది?

బెరెట్టా గన్ అంతకుముందు ఇంగ్లండ్‌లోని ఒక బ్రిటిష్ అధికారి దగ్గర ఉండేది. అది భారతదేశంలో గాడ్సే దగ్గరకు ఎలా చేరింది?

(5) సరిగ్గా హత్య జరిగే స్థలంలో అమెరికన్ సైనికాధికారి ఎందుకు ఉన్నాడు?

గాంధీ హత్య జరిగిన వెంటనే, అక్కడే ఉన్న అమెరికా సైనిక అధికారి హెర్బర్ట్ రేనర్ జూనియర్ స్పందన అనుమానాలు కలిగించేలా ఉంది. అతను అక్కడ ఆ సమయంలో ఉండడం యాదృచ్ఛికమా? లేక ఆ మొత్తం వ్యవహారంలో అతను ఏదైనా పెద్ద పాత్ర పోషించాడా?  

(6) అక్కడ బీబీసీ జర్నలిస్ట్ రాబర్ట్ స్టిమ్సన్, అమెరికన్ జర్నలిస్ట్ విన్సెంట్ షీన్ ఎందుకు ఉన్నారు?

విదేశీ మీడియా ప్రతినిధులు గాంధీ హత్య సమయంలో అక్కడే ఉండడం యాదృచ్ఛికమా? లేక ముందస్తుగానే నిర్ణయించిన సంఘటనని నమోదు చేయడానికి వాళ్ళను పంపించారా?

(7) ప్రపంచ పత్రికలన్నీ ఒకే తరహా కథనాన్ని అతికొద్ది గంటల్లో ఎలా ప్రచురించాయి?

గాంధీ హత్య జరిగిన మరుసటి రోజు అంతర్జాతీయంగా ప్రధానమైన ప్రతీ దినపత్రికా దాదాపు ఒకే శీర్షికతో వార్త రాసాయి. ‘‘గాంధీని ఒక హిందువు చంపేసాడు’’ అన్నదే ఆ హెడ్‌లైన్. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా రచించిన మీడియా ప్రచారం కాదా అది?

(8) నాథూరాం గాడ్సే విచారణ అత్యంత రహస్యంగా, హడావుడిగా ఎందుకు జరిగింది?

గాంధీ హత్య జరిగిన 22 నెలల్లోనే, నవంబర్ 1949న గాడ్సేకు ఉరిశిక్ష అమలయింది. గాంధీ హత్య గురించి మరింత నిశితమైన విచారణ జరపడానికి ఆస్కారం లేకుండా గాడ్సేకు శిక్ష అమలు చేయడానికి నెహ్రూ ఎందుకు అంత తొందర పడ్డాడు?

గాంధీ హత్యతో ఎవరు లాభపడ్డారు?

గాంధీ హత్య భారత రాజకీయ ముఖచిత్రాన్ని శరవేగంగా మార్చేసింది. 1948కి ముందు కాంగ్రెస్‌కు నెహ్రూ ఒక్కడే నాయకుడు కాదు. గాంధీ హత్య ఆయనకు పరిపూర్ణ అధికారం కట్టబెట్టేసింది. కాంగ్రెస్ మీద, భారత ప్రభుత్వం మీద నెహ్రూ పూర్తి పెత్తనం సాధించాడు.

అప్పట్లో క్రమంగా ఎదుగుతూ ప్రజాదరణ పొందుతున్న హిందూ మహాసభ, గాంధీ హత్య తర్వాత పూర్తిగా పక్కకు నెట్టివేయబడింది. భారతదేశం మీద కాంగ్రెస్ పార్టీ పట్టును బలోపేతం చేయడానికి పూర్తిస్థాయి భావోద్వేగ, రాజకీయ అంశంగా గాంధీ హత్య ఉపయోగపడింది. తర్వాత నెహ్రూ కుటుంబం భారతదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీలో నేటికీ ఆ వంశపు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.

గాంధీ హత్య కేసు విచారణకు సంబంధించిన ఛార్జిషీటు కావాలని కోరుతూ 2015లో సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దరఖాస్తు దాఖలైంది. దానికి వచ్చిన జవాబేమిటో తెలుసా? ఆ చార్జిషీటు మిస్సింగ్ అని. దిగ్భ్రాంతికరమైన ఆ నిజాన్ని బట్టి, ఆ కేసులో కీలకమైన సాక్ష్యాలు చెరిగిపోయి లేదా చెరిపేసి ఉండడానికి అవకాశం ఉందని భావించడం సాధ్యమవుతోంది.

గాంధీ హత్య ఒక ఆవేశపూరితుడైన అతివాది ఒక్కడుగా చేసినదేనా? లేక అంతకు మించి, చాలా జాగ్రత్తగా చాలామంది పాత్రధారులతో అల్లిన భారీ కుట్రా? భారతదేశపు రాజకీయ భవిష్యత్తును సమూలంగా మార్చేయడానికి ఆడిన మహర్నాటకంలో నాథూరాం గాడ్సే కేవలం ఒక పావు మాత్రమేనా?

Tags: Conspiracy AngleGandhi AssassinationJawaharlal NehruMahatma GandhiNathuram GodseTOP NEWS
ShareTweetSendShare

Related News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.