రాష్ట్రపతి భవన్‌లో అరుదైన వేడుక జరగబోతోంది. ఓ వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. రాష్ట్రపతి భవన్ పీఎస్‌వోగా పనిచేస్తోన్న అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకలు నిర్వహించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
జమ్ముకశ్మీర్‌లో అసిస్టెంట్ కమాండెంటుగా విధులు నిర్వహిస్తోన్న అవనీశ్ కుమర్‌తో పూనమ్ వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 12న వీరి వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాకు చెందిన పూనమ్ 2018లో యూపీఎస్సీ పరీక్షల్లో 81వ ర్యాంకు సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో మహిళా సీఆర్‌పీఎఫ్ దళనికి పూనమ్ సారథ్యం వహించారు.