Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా వ్యంగ్య వ్యాఖ్యలు, ఖండించిన ద్రౌపది ముర్ము, బీజేపీ ఆగ్రహం

Phaneendra by Phaneendra
Jan 31, 2025, 06:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభమైన సందర్భంగా ఇవాళ మొదటిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆ ప్రసంగంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పెర్సన్ సోనియా గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ అధికారికంగా ఖండించింది. ఇక బీజేపీ నాయకులు సోనియా వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత పార్లమెంటు బైట మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ‘‘ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె అసలు మాట్లాడనే లేకపోయారు. అయ్యో… పాపం… (పూర్ థింగ్)’’ అని వ్యాఖ్యానించారు. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు ఇంగ్లిష్ ప్రసంగం చేయడం రాదు అనే ఉద్దేశం వచ్చేలా సోనియా ‘పూర్ థింగ్’ అనే పదాన్ని వ్యంగ్యంగా ప్రయోగించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. ఆ సమయంలో సోనియా పక్కనే ఉన్న రాహుల్ గాంధీ తన తల్లితో రాష్ట్రపతి ప్రసంగం గురించి ‘బోరు కొట్టిందా? వ్యాఖ్యానించడానికి ఏమీ లేదా? ఒకేవిషయాన్ని పదేపదే చెబుతున్నారా? అంతే కదా’ అని చెప్పడం కెమెరాల్లో రికార్డ్ అయింది. దాన్ని బట్టి, సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతిని పరిహాసం చేసేవిగా ఉన్నాయి తప్ప సానుభూతితో చేసినవి కాదని స్పష్టమైంది.

‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి శ్రీమతి సోనియాగాంధీ పూర్‌థింగ్ అనడాన్ని నాతోపాటు ప్రతీ బీజేపీ కార్యకర్తా తీవ్రంగా ఖండిస్తున్నారు. అటువంటి పదాలను ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడం కాంగ్రెస్ పార్టీ యొక్క అతిశయ స్వభావాన్ని, పేదలకు వ్యతిరేకమైన, గిరిజనులకు వ్యతిరేకమైన లక్షణాన్నీ స్పష్టం చేసింది. గౌరవ రాష్ట్రపతికి, భారతదేశంలోని గిరిజన తెగలకూ కాంగ్రెస్ పార్టీ బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేసారు.

ఇవాళ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో సోనియా వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ కుటుంబపు దురహంకారం ఇవాళ మరోసారి కళ్ళకు కట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో మాట్లాడారు. అయితే రాజకుటుంబంలోని ఒకరికి ఆమె భాష బోరు కొట్టింది. అదే కుటుంబంలో మరొకరికి ఆమె మాటలు అలసిపోయినట్టు వినిపించాయి. అయ్యో పాపం అంటూ వ్యంగ్యం చేస్తున్నారు. రాజకుటుంబానికి అర్బన్ నక్సల్స్ మాటలే ఆసక్తికరంగా ఉంటాయి మరి. సోనియా గాంధీ వ్యాఖ్యలు పూర్తిగా అసంగతం. అవి కేవలం రాష్ట్రపతినే కాదు, దేశంలోని ప్రతీ పేద వ్యక్తినీ, ప్రతీ గిరిజన వ్యక్తినీ అవమానించాయి’’ అంటూ మోదీ మండిపడ్డారు.   

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ‘‘మన రాష్ట్రపతి గిరిజన మహిళ, ఆమె బలహీనురాలు కారు. ద్రౌపది ముర్ము దేశం కోసం, సమాజం కోసం విస్తృతంగా పనిచేసారు. ఆమె చేసిన సేవలు ఎలాంటివో వారు కనీసం ఊహించను కూడా ఊహించలేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరోవైపు సోనియాగాంధీ పేరు ప్రస్తావించకుండా, ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. అటువంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. దేశపు అత్యున్నత కార్యాలయం స్థాయిని తగ్గించేలాంటి ఆ వ్యాఖ్యలు రాష్ట్రపతి ఆత్మగౌరవాన్ని కించపరిచాయని స్పష్టం చేసింది.

పార్లమెంటు ప్రసంగం సమయంలో ఏ దశలోనూ రాష్ట్రపతి అలసిపోలేదని, బడుగు బలహీన వర్గాల కోసం మహిళలు రైతుల కోసం మాట్లాడడం రాష్ట్రపతికి ఎప్పుడూ అలసట కలిగించదనీ రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా రాష్ట్రపతి ఆత్మగౌరవాన్ని గాయపరిచాయి. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఆ నాయకులకు హిందీ వంటి భారతీయ భాషల పలుకుబడుల గురించి తెలియదేమో. ఏదేమైనా అటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం బాగోలేవు, అలా మాట్లాడడం దురదృష్టకరం. అలా మాట్లాడకుండా ఉండవచ్చు’’ అని ఆ ప్రకటన పేర్కొంది.

Tags: Budget Sessionjp naddaNarendra ModiParliament SpeechPresident Droupadi MurmuRahul GandhiRashtrapati BhavanSonia GandhiTOP NEWS
ShareTweetSendShare

Related News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.