ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మంత్రి లోకేశ్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన నారా లోకేశ్, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకాలు టీడీపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామకం ఉంటుందన్నారు.
ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం తరుచూ సంప్రదింపులు జరుపుతుందన్న నారా లోకేశ్ , విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. త్వరలో ‘ట్రాన్స్ఫర్ యాక్ట్’ తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థుల సంఖ్య కచ్చితత్వం కోసం అపార్ కార్డ్ విధానం తీసుకొచ్చామన్నారు.