ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక ఏడాదికి గాను శనివారంనాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రుల జాబితాలో చేరారు.
నిర్మలసీతారామన్ ఇప్పటి వరకు ఓ తాత్కాలిక బడ్జెట్, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో వరుసగా ఎనిమిది బడ్జెట్లు ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ శనివారం నాడు రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాని మోదీ హయాంలో అత్యధిక బడ్జెట్లను సమర్పించిన మంత్రిగా కూడా నిర్మలసీతారామన్ నిలవనున్నారు.
మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల ప్రవేశపెట్టి రికార్ నెలకొల్పారు. 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆరుసార్లు , 1967-69 మధ్య నాలుగు బడ్జెట్లు సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లు సమర్పించారు.
మోదీ తొలి విడత మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ సేవలు అందించారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 2019లో రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకుని ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్నారు.