బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో ప్రధాని మోదీ
వికసిత్ భారత్ కు బడ్జెట్ దోహదపడుతుందని ఆకాంక్ష
పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీ అమ్మవారు కరుణ చూపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలన్నారు.
వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు.
రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్న ప్రధాని మోదీ ఇన్నొవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో భారత్ అభివృద్ధి బాట పడుతోందన్నారు. అంతర్జాతీయంగా భారతదేశ పరపతి పెరుగుతోందన్నారు.