ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు.
ఇప్పటివరకు కుంభమేళాలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళా ప్రారంభమైన జనవరి 13 నుంచి 30వ తేదీ వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని లెక్కలతో వివరిచారు.
మౌనీ అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రభుత్వ నివేదిక ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేసింది.