కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఉగ్రవాదులు మరో 8 మంది బందీలను గురువారం విడుదల చేశారు. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన 110 మంది ఖైదీలను విడుదల చేసింది. హమాస్ ఉగ్రవాదులు విడుదల చేసిన బందీల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు, ఐదుగురు థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు. ఇజ్రాయెల్ మహిళా
సైనికురాలు బెర్గర్‌ను జబాలియా సరిహద్దు శిబిరం వద్ద హమాస్ ఉగ్రవాదులు రెడ్ క్రాస్ సంస్థకు అప్పించారు.
ఏడుగురు బందీలను యూనిస్‌లోని హమాస్ మాజీ నేత యాహ్యా సిన్వర్ నివాసం ముందు విడిచిపెట్టారు. దీనిపై ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బందీల ప్రాణాలకు రక్షణ లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా చేస్తే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడతాయని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ హెచ్చరికలతో మధ్యవర్తులు రంగంలోకి దిగారు. తదుపరి విడుదల సమయంలో గందరగోళం లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. బందీలను రక్షణ లేని ప్రాంతంలో విడుదల చేయడంతో ఇజ్రాయెల్ ఖైదీల విడుదలను ఆలస్యం చేసింది. మధ్యవర్తులు కల్పించుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించింది.