పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తణుకు ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన మూర్తి పలు ఆరోపణలతో ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇవాళ ఉదయం ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
ఎస్సై మూర్తి ఆత్మహత్య విషయం తెలియగానే పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ఆత్మహత్యకు కారణాలు వెల్లడికావాల్సి ఉంది. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఉద్యోగం పోవడం వల్ల అవమానంగా భావించారా అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు