చండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ 19 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, ఆప్ 17 స్థానాలు గెలుచుకున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మొదలైన కౌంటింగ్ కాసేపటి కిందట ముగిసింది. ఎన్నికల సంఘం అధికారులు ఫలితాలు ప్రకటించారు.
చండీగఢ్ కార్పొరేషన్లో మొత్తం 35 స్థానాలుండగా, అందులో ఒకరు ఎంపీగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆప్ 11, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 19 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.దీంతో చండీగఢ్ మేయర్ పదవి బీజేపీ ఖాతాలో పడింది. ఢిల్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫలితాల ప్రక్రియను వీడియో తీశారు.