ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది.కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు , అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండీ కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు.
బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 16 ముసాయిదాలను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన అధికారపక్షం జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది.
ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్నాయి. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 10న మొదలై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.