Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

“యమునలో విషం” ఆరోపణలపై కేజ్రీవాల్ మీద హర్యానా సర్కారు కేసు

Phaneendra by Phaneendra
Jan 30, 2025, 11:18 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీకి సరఫరా చేసే యమునా నదీజలాల్లో విషం కలిపిందంటూ హర్యానా ప్రభుత్వం మీద అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో ఆ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘అలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసినందుకు కేజ్రీవాల్ సిగ్గుపడాలి. క్యాబినెట్ మంత్రులు, ప్రధానమంత్రి కూడా అవే నీళ్ళు తాగుతారు. అలాంటి నీటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు రాజకీయాల నుంచి బహిష్కరిస్తారు’’ అని హర్యానా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి విపుల్ గోయెల్ అన్నారు. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్లు 2(డి), 54 ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు ఆయన ధ్రువీకరించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతో అరవింద్ కేజ్రీవాల్ మానసిక స్థిమితం కోల్పోయారని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు. కేజ్రీవాల్ చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. పరువునష్టం దావా వేస్తామన్నారు. ‘‘కేజ్రీవాల్ తాను పుట్టిన గడ్డనే అవమానించారు. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. యమునలో ఏ విషం కలిపారు, దాన్ని ఎంత వాడారు అన్న విషయాలు కేజ్రీవాల్ చెప్పాలి. యమునా జలాలు నిజంగా విషపూరితమే అయితే నదిలో చేపలు చనిపోయిన సాక్ష్యం ఉండాలి కదా, ఎక్కడ?’’ అని అడిగారు. యమునా నది ఢిల్లీలోకి ప్రవేశించే పల్లవ ఘాట్ దగ్గర యమున నీళ్ళను నాయబ్ సింగ్ సైనీ అందరూ చూస్తుండగా తాగారు.  

కేజ్రీవాల్ ఆరోపణల మీద ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఫిర్యాదు మేరకు ఈసీ మంగళవారమే కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించింది. తన ఆరోపణలకు ఆధారాలను జనవరి 29 రాత్రి 8 గంటల్లోపు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కేజ్రీ వ్యాఖ్యలను ఆ పరిధిలోనే పరిశీలిస్తామని ఈసీ స్పష్టం చేసింది.  

ఢిల్లోలో ఓ బహిరంగ సభలో గత సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను దుమ్మెత్తి పోసారు. సమాజంలో సెన్సేషన్ సృష్టించేందుకే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, కేజ్రీవాల్‌ను తీవ్రంగా విమర్శించారు. ‘‘యమునా జలాలు న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు, స్థానిక పేద ప్రజలు అందరూ తాగుతారు. కేవలం మోదీకి హాని కలిగించడానికి హర్యానా ఏకంగా నదినే విషపూరితం చేస్తుందని ఎవరు ఊహిస్తారు?’’ అన్నారు. కేజ్రీ ఆరోపణలు సంచలనం కలిగించడం కోసం చేసిన నిరాధార ఆరోపణలని కొట్టిపడేసారు.    

మరోవైపు కేజ్రీవాల్ తన ఆరోపణలను మరోసారి చేస్తూ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసారు. బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం ఢిల్లీలో సామూహిక జనహననాలకు పాల్పడేందుకే యమునా జలాలను విషంతో కలుషితం చేసిందని మళ్ళీ ఆరోపించారు. అక్కడితో ఆగని కేజ్రీవాల్, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేసిన పరిస్థితితో పోల్చారు. ‘‘సాధారణంగా శత్రుదేశాల మీద ఇలాంటి దాడులు చేస్తారు. జపాన్‌ మీద అమెరికా అణుబాంబులు వేసినట్లు. కొన్ని దేశాలు శత్రుదేశాల నదులను విషపూరితం చేయడానికి జీవాయుధాలను ప్రయోగిస్తాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పనే చేసింది’’ అంటూ ట్వీట్ చేసారు.

Tags: AAPArvind KejriwalDelhiDelhi Assembly ElectionsFIR registeredHaryana GovernmentPoisoning AllegationTOP NEWSYamuna River
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.