ఖలిస్థాన్ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూపై 104 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రకార్యకలాపాలపై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 96 కేసులు నమోదు చేశారు. పన్నూపై జాతీయ దర్యాప్తు సంస్థ 8 కేసులు నమోదు చేసింది. ఆ కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని కేంద్రం ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం సమయంలో వీఐపీల గ్యాలరీలో పన్నూ ప్రత్యక్షమయ్యారు. దీనిపై భారత్ తన స్వరం వినిపించింది. అమెరికా ప్రజలు యూఎస్ఏకు అనుకూలంగా నినాదాలు చేయగా, పన్నూ ఖలిస్థాన్‌కు అనుకూల నినాదాలు చేశాడంటూ వీడియోలు వైరల్ అయ్యాయి.
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థపై నిషేధం ఉంది. తాజాగా ఆ సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాది పన్నూను తమకు అప్పగించాలని భారత్… కెనడా, అమెరికా ప్రభుత్వాలను కోరుతోంది. గత ఆరేళ్లుగా పన్నూ పరారీలో ఉన్నారు.