ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక ఆలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ వస్త్రధారణ, పూర్తి ఆచ్ఛాదనతో రావాలని తేల్చి చెప్పింది.
స్కర్టులు, దేహం కనిపించేలా పారదర్శక దుస్తులు ధరించి వచ్చిన వారిని ఆలయంలోకి అనుమతించబోమని వెల్లడించింది.
కొందరు భక్తులు పాశ్చాత్య వస్త్రధారణతో వస్తుండటంపై పలువురు అసౌకర్యానికి గురి అయిన విషయాన్ని ప్రస్తావించారు. భక్తులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రస్ట్ వివరించింది.
ట్రౌజర్లు, చినిగిన దుస్తులు, పొట్టి స్కర్టులు, పారదర్శక దుస్తులు ధరించి వచ్చే భక్తులను ఆలయంలోకి లోపలికి అనుమతించబోమని ట్రస్ట్ పేర్కొంది.భక్తులు డ్రస్ కోడ్ విషయాన్ని పాటించాలని కోరింది.