ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్మి కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఎన్వీఎస్-02 ఉపగ్రహం అనేది ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు కాగా కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన మొదటి ప్రయోగం కావడం మరో విశేషం.
భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ వ్యవస్థల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలకు కూడా దోహదపడనుంది.