పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సమావేశాల ప్రారంభరోజున అంటే జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. తొలి విడత సమావేశాలు 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటాయి. రెండో విడతలో భాగంగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.
పార్లమెంటు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడతారు. జనవరి 31 న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన ముప్పై నిమిషాల తర్వాత రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా జనవరి 30న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.