అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే 90 వేల మంది అక్రమ వలసదారులను వివిధ దేశాలకు సైనిక విమానాల్లో తరలించినట్లు ప్రకటించింది. దేశంలో అనుమానిత ప్రతిప్రాంతంలోనూ అమెరికా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చివరకు గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కు మతపెద్దలు నిరసన తెలిపారు.
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను ఏరివేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టగానే అక్రమ వలసదారుల వేటకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అక్రమవలసదారుల వల్ల మాదకద్రవ్యాలు, లైంగికవేధింపులు, నేరాలు పెరిగిపోయాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. మెక్సికో సరిహద్దుల నుంచి డాంకీ పద్దతిలో
అక్రమ వలసదారులు అమెరికాలోకి జొరబడకుండా లక్షమంది సైనికులను మోహరించారు.
భారత్‌కు చెందిన దాదాపు 18 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే 2 వేల మందిని భారత్‌కు పంపించారు. విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులు వచ్చివేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. భారతీయులు ఏ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నా స్వచ్ఛందంగా దేశంలోని రావాలని కోరారు. అక్రమ వలసలను భారత్ ప్రోత్సహించదని ఆయన గుర్తుచేశారు.