బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. దొంగతనం కోసం వచ్చిన బంగ్లాదేశ్ జాతీయుడు షరీపుల్ ఇస్లాంకు చెందిన ఒక్క వేళిముద్ర కూడా లభించలేదని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయినా దీనిపై ముంబై పోలీసులు స్పందించలేదు. దాడి జరిగిన సైఫ్ అలీఖాన్ #sailalikhan ఇంట్లో 20 నమూనాలు సేకరించినా అవి షరీపుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్‌పై దాడి సమయంలో పెనుగులాట చోటుకుందని బాధితుడు చెప్పడంతో అతని దుస్తులు, అనుమానితుడి దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినా ఆధారాలు సేకరించడంతో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఈనెల 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుంగడులు ప్రవేశించి దొంగతనం చేసే క్రమంలో వారి మధ్య పెనుగులాట చోటు చేసుకుందని బాధితులు చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్ నివశించే అపార్టుమెంటులో సీసీ కెమెరాలు లేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక అనుమానితుడి తండ్రి షరీపుల్ ఇస్లాంను ఇరికించారంటూ చేసిన వ్యాఖ్యలతో కేసులో అనుమానాలు పెరిగాయి.