శ్రీకాకుళంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోగా మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు వ్యాపించడంతో షట్టర్లు తీయడం సాధ్యం కాలేదు.
పొక్రెయినర్ రప్పించి గోడను బద్దలు కొట్టి, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా వ్యాపించడంతో ఆరు అగ్నిమాపక శకటాలను రప్పించారు. విశాఖపట్నం నుంచి భారీ బ్రోంబో స్కై లిఫ్ట్ తెప్పించారు. ఆరు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు.