2025 సంవత్సరానికి పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశపు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతల జాబితాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. కళలు, సమాజ సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాణిజ్యం పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవలు వంటి రంగాల్లో కృషి చేసినవారికి ఈ గౌరవం లభిస్తుంది.
ఈ యేడాది ఏడుగురికి పద్మవిభూషణ్, 19మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఈ యేడాది పురస్కార విజేతల్లో 23మంది మహిళలు ఉన్నారు. 10మంది విదేశీయులు లేక ప్రవాస భారతీయులు లేక భారత సంతతి వారు ఉన్నారు. 13మందికి మరణానంతరం పురస్కారం ప్రకటించారు. ప్రతీయేటా గణతంత్ర దినం ముందు ప్రకటించే అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.
పద్మవిభూషణ్ పురస్కారాలు (7):
01. దువ్వూరు నాగేశ్వరరెడ్డి (వైద్యం) (తెలంగాణ)
02. జస్టిస్ (రిటైర్డ్) జగదీష్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు) (చండీగఢ్)
03. శ్రీమతి కుముదినీ రజనీకాంత్ లఖియా (కళలు) (గుజరాత్)
04. లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం (కళలు) (కర్ణాటక)
05. ఎం.టి వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) (కేరళ)
06. ఒసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) (జపాన్)
07. శ్రీమతి శారదా సిన్హా (మరణానంతరం) (కళలు) (బిహార్)
పద్మభూషణ్ పురస్కారాలు (19):
01. ఎ సూర్యప్రకాష్ (సాహిత్యం, విద్య – జర్నలిజం) (కర్ణాటక)
02. అనంతనాగ్ (కళలు) (కర్ణాటక)
03. బిబేక్ దేబరాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) (ఢిల్లీ)
04. జతిన్ గోస్వామి (కళలు) (అస్సాం)
05. జోస్ చాకో పెరియాప్పురం (వైద్యం) (కేరళ)
06. కైలాసనాథ్ దీక్షిత్ (పురావస్తు శాస్త్రం) (ఢిల్లీ)
07. మనోహర్ జోషి (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) (మహారాష్ట్ర)
08. నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) (తమిళనాడు)
09. నందమూరి బాలకృష్ణ (కళలు) (ఆంధ్రప్రదేశ్)
10. పిఆర్ శ్రీజేష్ (క్రీడలు) (కేరళ)
11. పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) (గుజరాత్)
12. పంకజ్ ఉధాస్ (మరణానంతరం) (కళలు) (మహారాష్ట్ర)
13. రామ్బహదూర్ రాయ్ (సాహిత్యం, విద్య – జర్నలిజం) (ఉత్తరప్రదేశ్)
14. సాధ్వి రితంభర (సమాజసేవ) (ఉత్తరప్రదేశ్)
15. ఎస్ అజిత్ కుమార్ (కళలు) (తమిళనాడు)
16. శేఖర్ కపూర్ (కళలు) (మహారాష్ట్ర)
17. శోభనా చంద్రకుమార్ (కళలు) (తమిళనాడు)
18. సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) (బిహార్)
19. వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) (అమెరికా)
పద్మశ్రీ పురస్కారాలు మొత్తం 113 మందికి ప్రకటించారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కె.ఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య), మాడుగుల నాగఫణిశర్మ (కళలు), దివంగత మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), తెలంగాణ నుంచి మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) ఉన్నారు.
పురస్కారాల పూర్తి జాబితా ఇదీ… 2025 పద్మ పురస్కారాలు