Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

అయోధ్య బాలరాముడి మూర్తికి శిలను సేకరించిన ప్రదేశంలో రామమందిర నిర్మాణ సన్నాహాలు

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీరామజన్మభూమి అయోధ్యలో ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత బాలరాముడి భవ్యమందిరం సాకారమవడం హిందువులందరినీ భావోద్వేగాలకు లోనుచేసింది. ఇటీవలే ఆ మందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం కూడా వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో… బాలరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి కృష్ణశిలను సేకరించిన స్థలంలో అద్భుతమైన రామాలయం నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో అరోహళ్ళి అనే గ్రామంలో ఒక వ్యవసాయభూమిలో లభించిన కృష్ణశిలతో బాలరాముడి మూర్తిని తీర్చిదిద్దారు. ఆ పొలం 80 ఏళ్ళ హెచ్ రామదాస అనే వ్యక్తిది. తన పొలంలో దొరికిన రాతితో అయోధ్యరామయ్య తయారవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ రాతిని వెలికితీసిన ప్రదేశంలో ఆయన ఒక షెడ్డు వేసి, అక్కడ రామ్‌లల్లా ఫొటో పెట్టారు. దానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నారు. ఆ ప్రదేశం స్థానికంగా భక్తులను ఆకర్షిస్తున్న తీర్థప్రదేశం అయిపోయింది.

ఇటీవల రామమందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆరోహళ్ళి గ్రామంలోని ఆ పొలంలో కూడా సుమారు 400మంది చేరి ప్రత్యేక పూజలు చేసారు. అరమణె గణేశ మందిరం పూజారి ప్రహ్లాదరావు ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలకు చాముండేశ్వరి నియోజకవర్గ ఎంఎల్ఎ జిటి దేవెగౌడ కూడా హాజరయ్యారు.  

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన గత జనవరి 22నే అరోహళ్ళిలోని పొలంలో కూడా రామమందిరం నిర్మించడానికి ఆ పొలం యజమాని రామదాస శంకుస్థాపన చేసారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఆలయ నిర్మాణం అప్పటికి ఆగిపోయింది. ఎలాగైనా అక్కడ చిన్న గుడి కట్టాలని రామదాస మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రామదాస ఉత్సాహానికి స్థానిక ఎంఎల్ఎ దేవెగౌడ ఊతమిచ్చారు. అక్కడ భారీస్థాయిలో పెద్ద గుడి కట్టడానికి తనవంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక ట్రస్టు రిజిస్టర్ చేసి నిధులు సేకరించే ప్రయత్నం  ప్రారంభించారు.   

అయోధ్యలో బాలరాముడి మూర్తి రూపకల్పనకు తమ పొలంలోని శిల ఎంపికైందని తెలిసిన నాటినుంచీ రామదాస ఆనందానికి అవధులు లేవు. తర్వాత సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నుల మూర్తులకు కూడా అక్కడినుంచే శిలను సేకరించారు. వాటికి వేటికీ ఆయన పైసా డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు, ఆ రాయి సేకరించిన స్థలంలో రాముడికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన నలుగురు కొడుకులు కూడా దానికి ఒప్పుకున్నారు.

అయోధ్య భవ్యమందిరంలో బాలరాముడి మూర్తికి రూపకల్పన చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతనే ఈ కొత్త ఆలయంలోనూ రాముడి మూర్తిని చెక్కించాలని రామదాస భావిస్తున్నాడు. అయోధ్య మందిరం లాంటి అద్భుతమైన మందిరమే ఆరోహళ్ళిలోనూ వెలియాలన్నది ఆయన ఆకాంక్ష.

Tags: ArohalliAyodhya Balak Ram MandirKarnatakaLord Ram StatueNew TempleSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.