విశాఖ సీతమ్మధారలో అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై స్థానికులు సహా హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతల ఆక్రమణలు కూల్చివేయకుండా ఆలయాల జోలికి రావడమేంటని హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు.
ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చడమేంటని అధికారులను ప్రశ్నించారు. శ్రీరామనవమి లోగా ఆలయాన్ని మళ్ళీ నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆల్టిమేటం డిమాండ్ చేశారు.
సీతమ్మధారలోని శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం పక్కనే ఉన్న అభయాంజనేయస్వామి ఆలయాన్ని అధికారులు కూల్చివేశారు. కూల్చివేతకు ముందు కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని , ఏకపక్షంగా అధికారులు ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు చెబుతున్నారు. నిజంగా ఆలయం ఆక్రమణలో ఉండిఉంటే మిగతా ఆక్రమణలతో పాటే ఆలయం జోలికి రావాలని అంటున్నారు. హిందువులను కించపరిచేలా అధికారులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.