రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తోన్న 17 మెడికల్ కళాశాలల్లోనూ ఉచిత మెడికల్ సీట్లు ఉంటాయని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కళాశాల నిర్మించి, నిర్వహించినా ఉచిత సీట్లు ఉంటాయని మంత్రి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ కింద కేంద్రం కొంత నిధులు ఇస్తుందని నిలిచిపోయిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి విజయవాడలో వెల్లడించారు.
ఏపీలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి నిర్మాణం ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం కేవలం 14 శాతం మాత్రమే పనులు పూర్తిచేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. నిలిచిపోయిన పనుల పూర్తికి రూ.3 వేల కోట్లు అవసరం ఉంటుందని, ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వం ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు.
ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల అధ్యక్షుడు, మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. వార్డు స్థాయి వరకు కమిటీలు వేస్తున్నట్లు సత్యకుమార్ గుర్తుచేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఏపీలో బీజేపీ కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు