గోదావరి పుష్కరాల కోసం ప్రపంచస్థాయి హంగులతో ముస్తాబు
రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టింది. ఈ స్టేషన్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమండ్రి రైల్వే స్టేషన్ చాలా ముఖ్యమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు విశాఖ, కాకినాడ, భీమవరం వైపు ప్రయాణిస్తారు.
ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది ప్రయాణాలు చేస్తారనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద రూ.250 కోట్ల నిధులతో పాటు పుష్కరాల కోసం మరో రూ. 21 కోట్లు అదనంగా రైల్వే శాఖ మంజూరు చేసింది.