నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య సూచికను విడుదల చేసింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 పేరిట దీనిని విడుదల చేసింది. ఆర్థిక విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా వ్యవహరించే నీతి ఆయోగ్ , రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికగా నివేదిక రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఈ నివేదికను విడుదల చేశారు.
ఏపీ 2022-23లో 17వ స్థానంలో ఉండగా, ఆ ఏడాదిలో ఏపీ ఆర్థిక ఆరోగ్య స్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఏపీ, హర్యానా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ గట్టి ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కుంటున్నాయని ప్రస్తావించిన నీతి ఆయోగ్ , ఆయా రాష్ట్రాలకు చేయూత ఇవ్వాలని సూచించింది.
దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలలో ఆర్థిక ఆరోగ్యంలో ఒడిశా అగ్రస్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్, గోవా వరుసగా 55.2 మరియు 53.6 స్కోర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మెరుగుదల కనిపిస్తుందని నివేదక పేర్కొంది. ఖర్చు నాణ్యత, రుణ నిర్వహణలో బలహీనమైన పనితీరు కారణంగా కర్ణాటక క్షీణతను ఎదుర్కొంటోందని వివరించింది.