బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.83 వేలు దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి బయట పడుతున్నారు. బులియన్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, ట్రంప్ కఠిన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. గడచిన వారంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు రూ.16 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.
తాజాగా బంగారం ధర రూ.200 పెరిగి పది గ్రాములు రూ.83200లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి #gold దూకుడు ప్రదర్శిస్తోంది. ఔన్సు గోల్డ్ 2770 అమెరికా డాలర్లుకు చేరింది. ఏడాది చివరకు 3000 డాలర్లు దాటవచ్చనే అంచనాలున్నాయి. ఇక ముడిచమురు ధరలు కూడా దూకుడుమీదున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 79 డాలర్లు దాటిపోయింది. వెండి కిలో రూ.94 వేలపైగా పలుకుతోంది.