దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలో మూడేళ్ల బాలికపై వైసీపీ నేత లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
చిత్తూరు జిల్లా నగరిలో మూడేళ్ల బాలికపై అదే వీధికి చెందిన వైసీపీ యువనేత ఒకరు లైంగిక దాడి చేశాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు గమనించి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తీవ్ర అనారోగ్యంపాలు కావడంతో వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన నగరి పోలీసులు వైసీపీ యువనేతను అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారించడంతో లైంగికదాడి వ్యవహారం బయటపడింది. బాధితులను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పరామర్శించారు. బాలికపై అత్యాచారం ఘటనపై హోమంత్రి అనిత స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.