యూపీ, దిల్లీల్లోని ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. వారం రోజులుగా కోచింగ్ సెంటర్లు తెరవడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతోనే బోధనాసిబ్బంది సంస్థను వీడుతున్నట్లు తేలింది.
నోయిడా, ఘజియాబాద్, భోపాల్, వారణాసి, దిల్లీ, పాట్నా, యూపీలోని మీరట్ సెంటర్ను కూడా తాజాగా క్లోజ్ చేశారు. నోయిడా నుంచి ఫ్యాకల్టీని తెప్పించి సెంటర్ ను నడిపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. విద్యార్థుల తల్లితండ్రులు పోలీసు ఫిర్యాదు కూడా చేశారు. కోచింగ్ సంస్థ నుంచి ముందస్తు నోటీసు కానీ, రిఫండ్ కానీ ఇవ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
చాలా నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఫ్యాకల్టీ సభ్యులు సంస్థలను వీడుతున్నారని ఓ ఉద్యోగి తెలిపారు. ఫిట్జ్లో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు కూడా వార్తు వెలువడ్డాయి. కొన్ని చోట్ల లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా బ్రాంచీలు నడుపుతుంనే ఆరోపణలు వస్తున్నాయి.
ఫిట్జ్ సంస్థను 1992లో డీకే గోయల్ స్థాపించారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలకు ఇక్కడ ప్రత్యేక కోచింగ్ ఇచ్చేవారు. దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 ఫిట్జ్ కేంద్రాలు ఉండగా సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారు.