టికెట్ బుక్ చేసుకునే సమయంలో మన దగ్గర నగదు లేకపోయినా ఇబ్బందిలేదు. టికెట్ బుక్ చేసుకుని తర్వాత మొత్తాన్ని చెల్లించే సదుపాయాన్ని భారతీయ రైల్వే శాఖ తీసుకొచ్చింది. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాకపోతే టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని తేల్చి చెప్పింది.
టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల తర్వాత కూడా చెల్లించకపోతే మాత్రం 3.5 శాతం సర్వీస్ చార్జ్ కట్టాల్సి ఉంటుంది. చెల్లింపు ఎంత ఆలస్యం చేస్తే అంత చార్జీ పెరుగుతుంది. పే లేటర్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు www.epaylater.in అనే వెబ్‌సైట్‌లో ప్రయాణీకులు రిజిస్టర్ చేసుకోవాలి.
టికెట్ బుక్ చేసుకున్న వెంటనే పేమెంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ‘పే లేటర్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.