తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు ఆధ్వాత్మిక,ధార్మిక నామాలు పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దాతలు వారు నిర్మించిన భవనాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లు మార్చి దేవతలు, దేవుళ్ల పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. తిరుమలలో మొత్తం 46 అతిథి గృహాలు ఉన్నాయి.
మొదటగా టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ భవనం పేరును లక్ష్మి భవన్‌గా మార్చారు. మిగిలిన భవనాల పేర్లు కూడా మార్చాలని నిర్ణయించారు. మార్చే ముందు భవనాలు నిర్మించిన వారితో సంప్రదింపులు జరుగుతున్నారు. ఇప్పటికే కొందరు స్వచ్ఛందంగా అంగీకరించారు. మరికొందరిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.