అనంతపురం లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక నారాయణ ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అందరితో పాటు క్లాసులో కూర్చొన్న సదరు విద్యార్థి ఉన్నట్టుండి బయటకు వచ్చి బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఆ క్లాసు రూమ్ మూడో అంతస్తులో ఉండగా అక్కడి నుంచే తోటి విద్యార్థులు,లెక్చరర్ చూస్తుండగా దూకేశాడు. కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థి దూకిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్, ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. గాయపడిన చరణ్ ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు.
సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడ ఏమిటని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.