ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గురువారం రోజున మధ్యాహ్నం సమయానికి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు లెక్కలతో వివరించింది. జనవరి 13న కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి నేటి మధ్యాహ్నం వరకు పదికోట్ల మంది ప్రయాగ్ రాజ్ లో స్నానాలు ఆచరించారు.
మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని, 1.7 కోట్ల మంది పుష్య పౌర్ణిమ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపింది. కుంభమేళాకు ఈసారి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుంది.